రూ.120 బిల్లు కోసం.. మామ హత్య

A Man Was Assassinated Due To Ask Nephew To Pay Rs 120 In Madhya Pradesh - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యక్తి రూ.120 చెల్లించమన్నందుకు తన మేనమామను హత్య చేశాడు. ఈ ఘటన గ్యాలియర్‌లోని ఓల్డ్ కాంట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కయూమ్ ఖాన్ చేపలను విక్రయించేవాడు. అతని మేనల్లుడు సమీపంలో చేపల వేపుడును అమ్మేవాడు.అయితే ఆదివారం రాత్రి కల్లు ఖాన్ అతని మేనమామ దగ్గర రూ.120కి చేపలను కొని, బిల్లు చెల్లించలేదు.

దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతే కల్లు అనే వ్యక్తి కయూమ్ ఖాన్‌పై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన కయూమ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఇక మృతుడి కుటుంబం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top