డ్రగ్స్‌ కోసం దాడి: అవమానం తట్టుకోలేక ఫ్రెండ్‌ ఆత్మహత్య

Man Suicide In Ludhiana Over Drug Addict Friend Thrashed And Humiliated Him - Sakshi

లుధియానా: స్నేహితుడు తీవ్రంగా దాడి చేసి అవమానించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పంజాబ్‌ లుధియానా సమీపంలోని ఖన్నా సిటీలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన  వివరాల ప్రకారం.. సుఖ్వింధర్‌ సింగ్‌, సోను అనే ఇద్దరు యువకులు స్నేహితులు. అయితే సోను డ్రగ్స్‌  బానిసగా మారాడు. అయితే సోమవారం రోజు తన స్నేహితుడు సుఖ్వింధర్‌ సింగ్‌ను మోటర్‌సైకిల్‌పై వెళ్లి డ్రగ్స్‌ తీసుకురావాలని సోను చెప్పాడు. డ్రగ్స్‌ కోసం వెళ్లిన సుఖ్వింధర్‌ కొన్ని గంటల వరకు తిరిగి రాకుండా.. డ్రగ్స్‌ కూడా తీసుకురాలేదు. దీంతో కోపోద్రిక్తుడైన సోను సుఖ్వింధర్‌పై దాడి చేసి అవమానించాడు.

చదవండి: బస్సులో బాలికపై అమానుషం

అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన సుఖ్వింధర్‌.. విషం దాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే సుఖ్వింధర్‌ కూడా సోనుతో పాటు కొంతకాలంగా డ్రగ్స్‌ తీసుకోవడంతో అతని శరీరం చికిత్సకు సహకరించలేదని వైద్యులు తెలిపారు. సుఖ్వింధర్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న సోను కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

చదవండి: ప్రేమికులపై పైశాచికం: మెడలో టైర్లు వేసి..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top