ప్రేమికులపై పైశాచికం: మెడలో టైర్లు వేసి..

Madhya Pradesh Couple Forced To Dance With Tire Around Neck For Eloping - Sakshi

భోపాల్‌: ప్రేమించి.. పెళ్లి చేసుకోవాలని భావించి ఇంటి నుంచి పారిపోయిన ఓ ప్రేమ జంటను దారుణంగా హింసించారు వారి గ్రామస్తులు. స్కూటర్‌ టైర్‌ మెడలో వేసి.. డ్యాన్స్‌ చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌ ధార్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..

ధార్‌ ప్రాంతంలోని కుండి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి అదే ఊరికి చెందిన 23 ఏళ్ల వ్యక్తి ప్రేమించుకున్నారు. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో ఈ నెల మొదటి వారంలో ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు మిస్సింగ్‌ కంప్లైంట్‌ ఇచ్చారు. 
(చదవండి: ప్రేమికుల కిడ్నాప్‌.. అడవుల్లో తిప్పుతూ చిత్రహింసలు!)

వారం రోజుల అనంతరం వారు గ్రామానికి తిరిగి వచ్చారు. ప్రేమికుల ప్రవర్తనపట్ల ఆగ్రహంగా ఉన్న గ్రామస్తులు వారి చేసిన పనికి తగిన శిక్ష విధించాలని భావించారు. రచ్చబండ వద్దకు వారిని పిలిపించారు. అనంతరం గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి.. ఆ జంటను కర్రతో పలు మార్లు కొట్టాడు. అనంతరం వారి మెడలో స్కూటర్‌ టైర్‌ వేసి డ్యాన్స్‌ చేయించారు.
(చదవండి: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త ట్విస్ట్‌ )

ఈ ప్రేమ జంటకు సాయం చేసిందనే ఆరోపణలతో 13 ఏళ్ల బాలికను కూడా ఇదే విధంగా హింసించారు. గ్రామస్తుల్లో కొందరు ఈ తతంగాన్ని వీడియో తీసి.. సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇది వైరలయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. ప్రేమికుల మీద దాడి చేసిన వారిలో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. 

చదవండి: దారుణం: ‘మా అమ్మాయినే వేధిస్తావా?’ మెడకు బెల్ట్‌ బిగించి..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top