కోడలిపై అఘాయిత్యం: నిలదీసిన కొడుకును..

Man Molested Daughter In Law And Assassinated Son In UP - Sakshi

లక్నో : కోడలిపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, ఈ విషయాన్ని ప్రశ్నించిన కుమారుడిని కాల్చి చంపాడో వ్యక్తి. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌, మొరాదాబాద్‌కు చెందిన 56 ఏళ్ల వ్యక్తి ఈ నెల 25న కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇంట్లో అందరూ పెళ్లి వేడుకకు వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న కోడలిపై ఈ పాడుపనికి ఒడిగట్టాడు. ( బాంబు పేలుడు: 26 మంది దుర్మరణం)

శనివారం ఈ విషయాన్ని భర్త, అత్తకు చెప్పిందామె. దీంతో తండ్రీ, కొడుకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన తండ్రి తన లైసెన్స్‌ తుపాకితో కుమారుడిని కాల్చిచంపాడు. బాధితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడి భార్య, తల్లి, ఆ ఇంటి పనిమనిషి నుంచి వివరాలను సేకరించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top