మాదాపూర్‌: ప్రేయసిపైనే అత్యాచారం.. ఆపై దారుణ హత్య | Man Molestation On His Lover And Assassinates Her Madhapur Hyderabad | Sakshi
Sakshi News home page

మాదాపూర్‌: ప్రేయసిపైనే అత్యాచారం.. ఆపై దారుణ హత్య

Feb 23 2022 8:13 PM | Updated on Feb 23 2022 8:15 PM

Man Molestation On His Lover And Assassinates Her Madhapur Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌:  ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిపైనే  అత్యాచారం చేసి.. ఆమె ప్రాణం తీశాడో ప్రియుడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాలుప్రసాద్‌ అనే యువకుడు హైటెక్‌సిటీ ఔట్‌పోస్ట్  వద్ద తన ప్రేయసిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశాడు.

ఈ కేసులో పోలీసులు నిందితున్ని సీసీటీవీ కెమెరాల ఆధారం పట్టుకొని అరెస్ట్‌ చేశారు. తనతో కాకుండా నరేష్‌ అనే యువకునితో సన్నిహితంగా ఉంటుందనే అక్కసుతోనే తను ఆమెను అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు పోలీసులు ముందు లాలుప్రసాద్‌ ఒప్పుకున్నాడు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement