స్నేహితుడి భార్యపైనే కన్నేసి.. ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి.. | Man Molestaion on Friend Wife in Gudur Tirupati District | Sakshi
Sakshi News home page

స్నేహితుడి భార్యపైనే కన్నేసి.. ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి..

Apr 21 2022 6:59 AM | Updated on Apr 21 2022 7:07 AM

Man Molestaion on Friend Wife in Gudur Tirupati District - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

రాత్రి ఆరుబయట పిల్లలతో నిద్రిస్తున్న స్నేహితుడి భార్య తలపై మొదట ఇనుప రాడ్‌తో బలంగా కొట్టాడు. ఆమె స్పహ తప్పడంతో పక్కనే ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బుధవారం ఉదయం తేరుకుని విషయం బంధువులకు తెలియజేయడంతో వారు రూరల్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

గూడూరు (తిరుపతి): స్నేహితుడి భార్యపైనే కన్నేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన గూడూరు రూరల్‌ మండలంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం.. గూడూరు మండలం, చవటపాళెంకు చెందిన సోగా హరినారాయణ అలియాస్‌ హరికుట్టి అదే ప్రాంతంలోని ఓ వ్యక్తితో స్నేహంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడి భార్యపై కన్నేసి సమయం కోసం ఎదురు చూశాడు. మంగళవారం స్నేహితుడు పని నిమిత్తం బయటి ప్రాంతానికి వెళ్లాడు.

హరినారాయణ ఇదే అదునుగా భావించాడు. అదే రోజు రాత్రి ఆరుబయట పిల్లలతో నిద్రిస్తున్న స్నేహితుడి భార్య తలపై మొదట ఇనుప రాడ్‌తో బలంగా కొట్టాడు. ఆమె స్పహ తప్పడంతో పక్కనే ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బుధవారం ఉదయం తేరుకుని విషయం బంధువులకు తెలియజేయడంతో వారు రూరల్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ పీ.శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పోలీసు సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివాహితను వైద్యపరీక్షల నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

చదవండి: (కుమార్తె స్నేహితురాలిపై లైంగిక దాడి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement