టిప్పర్‌ ఢీకొని.. కాపాడండని వేడుకుని.. | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ ఢీకొని.. కాపాడండని వేడుకుని..

Published Wed, Aug 23 2023 1:42 AM

Man dead in an accident - Sakshi

ఖమ్మం క్రైం: అతి వేగంతో వచ్చిన ఇసుక టిప్పర్‌ ఢీకొని ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.. టిప్పర్‌ కింద చిక్కుకుపోయిన యువకుడు తనను కాపాడాలని వేడు కున్నాడు.. పోలీసులు స్పందించి యువకుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరా లివి. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం ముష్టికుంట్లకు చెందిన దొప్పా వీరబాబు కుమారుడు విజయ్‌కుమార్‌ ఖ మ్మంలోని ఓ ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు.

ఖమ్మం శ్రీని వాసనగర్‌లో ఉంటున్న ఆయన మంగళవారం గదికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. పక్కనే అతివేగంగా వచ్చిన ఇసుక టిప్పర్‌ కుడివైపునకు తిరగడంతో విజయ్‌కుమార్‌ను ఢీకొంది. విజయ్‌ అదుపు తప్పి లారీ చక్రాల కింద పడిపోయాడు. ఆయన నడుం భాగంపైకి టైర్లు ఎక్కడంతో శరీరం నుజ్జునుజ్జయింది.

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ.. తన ప్రాణాలు కాపా డాలని ఆ యువకుడు వేడు కున్నాడు. సమాచారం అందుకున్న ఖమ్మం త్రీటౌన్‌ సీఐ బత్తుల సత్యనారాయణ చేరుకుని విజయ్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంఘటనపై కేసు నమోదు చేసి నిర్లక్ష్యంగా టిప్పర్‌ నడిపిన డ్రైవర్‌ బుడిగ ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement