బాలికపై అత్యాచారయత్నం.. నిరాకరించడంతో!

Man Attempts Molested On 13 year Old Girl In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం : జిల్లాలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలికపై ఓ కీచక వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే ముస్తాఫా‌ నగర్‌లోని ఓ సంపన్న కుటుంబంలో 13 ఏళ్ల బాలిక పనిమనిషిగా చేరింది. అయితే యజమాని కుమారుడు...బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటిం‍చడంతో ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. చదవండి: బాలికపై అత్యాచార యత్నం: ప్రతిఘటించిన సోదరి

పల్లెగూడెం గ్రామానికి చెందిన ఆ బాలిక 70 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా ఈ దూరాగతానికి పాల్పడిన యజమాని కుమారుడు బాలికను తీవ్రంగా బెదిరించినట్లు సమాచారం. ఈ విషయం ఎవరికైనా చెబితే బాలికతో పాటు తల్లిదండ్రులను కూడా చంపుతానని బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  చదవండి: పెరుగుతున్న రేప్‌లు, తగ్గుతున్న శిక్షలు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top