టిఫిన్‌ లేదని చెప్పినందుకు కత్తి తీసుకుని.. | Man Attack Tiffin Shop Woman With Knife Srikakulam | Sakshi
Sakshi News home page

టిఫిన్‌ ఇవ్వలేదని పొడిచేశాడు!

Jan 28 2022 3:06 PM | Updated on Jan 28 2022 3:21 PM

Man Attack Tiffin Shop Woman With Knife Srikakulam - Sakshi

ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ సందీప్‌కుమార్‌

పాతపట్నం(శ్రీకాకుళం): టిఫిన్‌ ఇవ్వలేదనే కోపంతో నందిగాం మండలం దిమ్మిడిజోల గ్రామానికి చెందిన సరియాపల్లి అప్పారావు.. మెళియాపుట్టి మండలం పరశురాంపురం పంచాయతీ తూముకొండ రామచంద్రాపురం గ్రామానికి చెందిన బురిడి సుందరమ్మపై కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూముకొండ ప్రధాన రహదారిపై బురిడి సుందరమ్మ టిఫిన్‌ సెంటర్‌(షాపు) నడుపుతోంది.

గురువారం ఉదయం పదిగంటల సమయంలో టిఫిన్‌ కోసం అప్పారావు అనే వ్యక్తి వచ్చాడు. అప్పటికే టిఫిన్‌ అయిపోందని సుందరమ్మ చెప్పి డబ్బులు లెక్కపెట్టుకుంటోంది. మద్యం మత్తులో ఉన్న అప్పారావు కోపంతో తన వద్ద ఉన్న కత్తితో సుందరమ్మపై దాడి చేశాడు. మెడపై, తలపై తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో ఉన్న సుందరమ్మ చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు, 108కు సమాచారం అందించారు. సిబ్బంది టెక్కలి జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.  సీఐ ఎం.వినోద్‌బాబు, ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌  ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. క్లూస్‌ టీం చేరుకుని కత్తిని స్వాధీనం చేకున్నారు. నిందితుడు పరారిలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

చదవండి: Hyderabad Woman Drunken Drive: మద్యం మత్తులో యువతి కారుతో బీభత్సం.. సెకన్ల వ్యవధిలోనే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement