చనిపోయిన యజమాని ఏటీఎమ్‌తో.. | Maid Draws 35 Lakhs From Dead Owners Account With His ATM | Sakshi
Sakshi News home page

కిలాడీ పనిమనిషి.. చనిపోయిన యజమాని ఏటీఎమ్‌తో..

Aug 19 2020 8:43 PM | Updated on Aug 19 2020 8:49 PM

Maid Draws 35 Lakhs From Dead Owners Account With His ATM - Sakshi

రీటా పని చేస్తున్న ఇంటి భవన సముదాయం

కోల్‌కతా : చనిపోయిన యజమాని ఏటీఎమ్‌ కార్డును దొంగిలించి లక్షల రూపాయలు డ్రా చేసుకుందో పనిమనిషి. దాదాపు 35లక్షలు దోచుకున్న తర్వాత పోలీసులకు చిక్కి జైలు పాలయింది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నదియ, నాకాసిపురకు చెందిన రీటా రాయ్‌ అనే మహిళ కోల్‌కతా అన్వర్‌షా రోడ్‌లోని ఓ ఇంటిలో గత ఏడేళ్లుగా పని చేస్తోంది. లాక్‌డౌన్‌ మొదలైన కొన్ని రోజులకే మరణించిన ఇంటి యజమాని ఏటీఎమ్‌ కార్డును దొంగిలించి గత రెండు నెలల నుంచి ఖాతాలోని డబ్బులను మాయం చేయటం మొదలుపెట్టింది. ( నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు )

ఇలా మొత్తం 35 లక్షల రూపాయల వరకు కాజేసింది. మృతుడి ఖాతాలోంచి డబ్బులు మాయం అవటం గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన డిటెక్టివ్‌ డిపార్ట్‌మెంట్‌ రీటాను అదుపులోకి తీసుకుంది. ఆమెతో పాటు దొంగతనానికి సహకరించిన మరికొందరిని కూడా అరెస్ట్‌ చేశారు అధికారులు. వారి వద్ద నుంచి 27 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement