నిజామాబాద్‌లో ప్రేమ జంట ఆత్మహత్య | Lovers Deceased In Nizamabad District | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌లో ప్రేమ జంట ఆత్మహత్య

Jan 25 2021 1:28 PM | Updated on Jan 25 2021 1:32 PM

Lovers Deceased In Nizamabad District - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: జిల్లాలోని నందిపేట్‌ మండలంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపుతోంది. కుద్వాస్‌పూర్‌ గ్రామానికి చెందిన సుకన్య సోమవారం  తెల్లవారుజామున గ్రామంలోని తన ఇంటి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మరణ వార్త తెలిసిన వెంటనే ఐలపూర్‌ గ్రామానికి చెందిన ప్రియుడు ప్రేమ్‌కుమార్‌ తీవ్రమైన మనస్థాపానికి గురై గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ప్రేమ జంట ఆత్మహత్యలపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement