పెద్దలు అడ్డుకుంటారని.. ప్రేమజంట ఆత్మహత్య 

Love Couple suicide In Rangareddy District - Sakshi

కొందుర్గు: వారిద్దరూ ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమయ్యారు. పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అమ్మాయి మైనర్‌ కావడంతో కుటుంబ పెద్దలు, బంధువులు అడ్డు చెబుతారని భావించిన ప్రేమ జంట పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొందుర్గు మండలం ఉత్తరాసిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి శ్రీకాంత్‌(24) షాద్‌నగర్‌లో ఓ కిరాణ షాపులో పని చేస్తున్నాడు. కిస్మత్‌పూర్‌ గ్రామానికి చెందిన మాధవి(16)తో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది.

అది కాస్తా ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. అమ్మాయి మైనర్‌ కావడంతో పాటు ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించకపోవచ్చని ఇద్దరూ గత నెల 27న యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నారు. శ్రీకాంత్‌ జంటగా స్వగ్రామానికి గత నెల 30న వచ్చారు. కుటుంబ సభ్యులు ఆక్షేపిస్తారన్న భయంతో శ్రీకాంత్, మాధవి గ్రామ శివారులోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచనమేరకు మార్చి 31 హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మాధ«వి మృతి చెందింది. ఈ క్రమంలో మంగళవారం శ్రీకాంత్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై శ్రీకాంత్‌ తల్లి లక్ష్మమ్మ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనయ్య తెలిపారు. 

Election 2024

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top