Hyderabad: పంజగుట్టలో దారి దోపిడీ.. 3.5 లక్షలున్న బ్యాగ్‌తో పరార్‌.. పోలీసులు వెంబడించడంతో..

Looters Theft 2 Lakhs Of Gold Shop Money At Panjagutta - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరం నడిబొడ్డన దారి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. పంజగుట్టలో ఓ వ్యక్తి గోల్డ్‌ షాప్‌ క్లోజ్‌ చేసి డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తుండగా.. దృష్టి మళ్లించిన దొంగలు దారి దోపిడికి తెగబడ్డారు. గ్రీన్‌  ల్యాండ్స్‌ దారిలో బైక్‌పై వచ్చిన దొంగలు బంగారం షాపు యాజమాని నుంచి రూ. 3.5 లక్షలున్న రెండు బ్యాగ్‌లతో పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు దొంగలను వెంబడించడంతో రూ. 1.5 లక్షలు నగదు ఉన్న బ్యాగ్‌ను రోడ్డు మీదే వదిలేసి 2 లక్షల బ్యాగ్‌తో పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా విచారణ జరుపుతున్నారు. నిందితులు ఎవరు, తెలిసినవాళ్ల పనేనా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
చదవండి: హైదరాబాద్‌: 60 శాతం బస్సులు మేడారానికే.. ప్రత్యామ్నాయమేదీ?

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top