విడాకుల వివాదం.. మోడల్‌ దారుణ హత్య

Lebanon Model Strangled to Death by Husband for Demanding Divorce - Sakshi

విడాకులు అడిగిందని మోడల్‌ గొంతు కోసి హత్య చేసిన భర్త

బీరూట్‌: లెబనాన్‌కు చెందిన జైనా కంజో చాలా అందంగా ఉంటుంది. బ్యూటీ క్వీన్‌. ఇంతటి అందాల రాశిని చూసిన మోడలింగ్‌ ఏజెన్సీలు, ఇండస్ట్రీ ప్రముఖలు ఊరుకోరు కదా.. పిలిచి మరి అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ గుర్తింపు లభిస్తోంది. మోడల్‌గా ఎదుగుతున్న సమయంలోనే ఇంట్లో వాళ్లు పెళ్లి చేశారు. వివాహం అయ్యి ఇంకా ఏడాది కూడా గడవలేదు. అన్యోన్యంగా సాగాల్సిన వారి జీవితంలో ఘర్షణలు మొదలయ్యాయి. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి.. మోడల్‌గా రాణించాలనేది జైనా ఆశ. కానీ ఆమె భర్త మాత్రం అందరి భార్యల్లాగే జైనా కూడా ఇంటి పట్టునే ఉండాలని.. కుటుంబాన్ని చూసుకోవాలని భావించాడు. దాంతో ఇద్దరి మధ్య నిత్యం గొడవలే. 

ఇక లాభం లేదునుకుని జైనా భర్త నుంచి విడిపోవాలని భావించింది. కానీ విడాకులు తీసుకోవడం భర్తకు ఇష్టం లేదు. ఈ క్రమంలో ఈ నెల 7వ తారీఖున ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. ఆగ్రహంతో ఊగిపోయిన జైనా భర్త ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వత భయంతో అక్కడి నుంచి టర్కీ పారిపోయాడు. జైనాను హత్య చేసిన తర్వాత ఆమె భర్త తాను చేసిన దారుణం గురించి సోదరితో చెప్పాడు. వారి మధ్య జరిగిన ఫోన్‌ కాల్‌ రికార్డింగ్‌‌ మీడియాకు చిక్కింది. దీని ఆధారంగా పోలీసులు జైనా భర్త మీద కేసు నమోదు చేశారు. 

ఇక ఈ ఆడియో క్లిప్పింగ్‌లో జైనా భర్త తన సోదరిని ఉద్దేశించి.. ‘‘నన్ను ఏమైనా అడుగు. నేను కావాలని తనను చంపలేదు. ఆమె చనిపోవాలని నేను కోరుకోలేదు. ఆమె ఏడుస్తుండటంతో నా చేతిని ఆమె నోటికి అడ్డం పెట్టాను. ఏడవద్దని చెప్పాను. కానీ ఆమె నా మాట వినలేదు.. నాతో గొడవపడాలని చూసింది. తెల్లవారుతున్నా ఆమె ఏడుపు ఆపలేదు. నేను ఆమెను చంపానా’’ అని ఆడిగినట్లు తెలిసింది.

ఇక మరో దారుణమైన విషయం ఏంటంటే.. కొద్ది రోజుల క్రితమే జైనా తన భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను హింసిస్తున్నాడని.. భర్త నుంచి తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరింది. ఇది జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఆమె భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యింది. ఇక జైనా హత్యకు సంబంధించి ఆమె అభిమానులు పోలీసులు తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

చదవండి: అందానికి కొలతలెందుకు?
                57వ ఏట మళ్లీ ప్రేమను అనుభూతి చెందాను

                   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top