విషాదం: రెండేళ్ల ప్రేమ, పెళ్లికి ఓకే చెప్పిన తర్వాత..

khammam: Girlfriend Commits Suicide After Lover Rejects Marriage For Dowry - Sakshi

సాక్షి, ఖమ్మం: నిన్ను పెళ్లి చేసుకోవాలంటే అడిగినంత కట్నం ఇవ్వాలి, లేదంటే పెళ్లి జరగదని ప్రియుడు ప్రియురాలికి తెగేసి చెప్పడంతో మనస్తాపానికి గురైన యువతి పురుగుమందు తాగి ఆత్మహత్య పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. లింగారంతండా శివారు బోటిమీది తండాకు చెందిన ఎంఫార్మసీ చదువుతున్న వడిత్యా లైలా (23)అదే తండాకు చెందిన డిప్లొమా చదువుతున్న బాణోత్‌ ప్రవీణ్‌ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఇరువురు తల్లిదండ్రులకు విషయం చెప్పారు.

ఇటీవల పెద్దల సమక్షంలో వివాహం జరిపేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో కట్నంగా కొంత నగదు ఇచ్చేందుకు యువతి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. కాగా యువకుడు, అతని తల్లిదండ్రులు కట్నం సరిపోదని, మరింత ఎక్కువ ఇస్తేనే పెళ్లి అని భీష్మించుకున్నారు. మనస్తాపానికి గురైన లైలా ఈనెల 9వ తేదీన పురుగుమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ప్రవీణ్, తల్లిదండ్రులు మంగు, బుజ్జి, తమ్ముళ్లు గణేష్, ప్రశాంత్‌పై మృతురాలి సోదరుడు ఫిర్యాదు చేయగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

చదవండి: 
వివాహేతర సంబంధం: మహిళ దారుణ హత్య

దారుణం: కారు కోసం 3 నెలల కొడుకును అమ్మేసిన తల్లిదండ్రులు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top