పిల్లలు ఎవరూ లేని సమయం చూసి.. ఇంట్లోకి చొరబడి..

మండ్య(బెంగళూరు): పట్టపగలే మహిళను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి చంపారు. మండ్య జిల్లా కిక్కేరిలో చోటు చేసుకుంది. పట్టణంలో మెడికల్స్ స్టోర్‌ను నడుపుతున్న దివంగత శ్రీకాంత్ భార్య పుష్పలత (45) హతురాలు. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. బుధవారం ఇంట్లో పిల్లలు ఎవరూ లేని సమయంలో చొరబడిన గుర్తుతెలియని దుండగులు ఆమెను గొంతుకోసి పరారయ్యారు.
రక్తపు మడుగులో ఆమె మృతదేహం పడి ఉంది. పట్టపగలే హత్య కావడంతో కిక్కేరి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆస్తి గొడవలే కారణం కావచ్చని అనుమానాలున్నాయి. కిక్కేరి పోలీసులు పరిశీలించి కేసు విచారణ చేపట్టారు.