
యశవంతపుర: బెళగావిలో మంగళవారం తెల్లవారుజామున జామున ఓ బిల్డర్ దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని గురుప్రసాద్‌నగరలో నివాసం ఉంటున్న బిల్డర్ రాజు దొడ్డబణ్ణవర (46) హత్యకు గురయ్యాడు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యను చూడటానికి ఆయన కారులో వెళ్తుండగా దుండగులు కారును అడ్డగించి కారం పొడి చల్లి మారణాయుధాలతో నరికి పరారయ్యారు.
మరో ఘటనలో..
వివాహిత ఆత్మహత్య
యశవంతపుర: వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చామరాజనగర జిల్లా కొళ్లేగాలలో జరిగింది. బాగలకోటకు చెందిన విద్యాశ్రీ (22)ని మూడేళ్ల క్రితం బెళగావికి చెందిన ఆనంద్‌కు ఇచ్చి వివాహం చేశారు. హనూరు తాలూకా హొగ్యం గ్రామపంచాయతీ పీడీఓగా పని చేస్తున్న ఆనంద్ కొళ్లేగాలలో నివాసం ఉంటున్నారు. విద్యాశ్రీని కట్నం కోసం వేధించటం వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి తొమ్మిది నెలల చిన్నారి ఉంది. ఆనంద్‌ను పోలీసులు విచారణ చేస్తున్నారు.