వ్యభిచార గృహంపై పోలీసుల దాడి | Hyderabad: Prostitution Racket Busted In Kukatpally | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

Apr 17 2021 2:17 PM | Updated on Apr 17 2021 2:40 PM

 Hyderabad: Prostitution Racket Busted In Kukatpally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై కూకట్‌పల్లి పోలీసులు దాడి చేసి నిర్వాహకులతో పాటు విటులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. వరంగల్‌ జిల్లాకు చెందిన ముక్కర రాజు(31) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

గత కొద్ది రోజులుగా భాగ్యనగర్‌కాలనీలోని ఓ అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌ నెంబర్‌ 303ని అద్దెకు తీసుకొని పానగం శ్రీకాంత్‌ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి ఇద్దరు నిర్వాహకులతో పాటు విటులు ముక్కపాటి హరి, ఆకుని నీలంధర్, జింకల పృథ్వీరాజ్‌తో పాటు ఓ యువతిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, రూ.2 వేల నగదును స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు.   

 ( చదవండి: జుత్తాడ మర్డర్‌: పాత కక్షలతో దారుణానికి ఒడిగట్టిన కిరాతకుడు )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement