సుమంత్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు

Hyderabad Police Held Man Who Created Fake Profile With Girl Name In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమ్మాయిలను లోబరుచుకునేందుకు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకున్న సుమంత్‌ను సైబర్‌‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ... నకిలీ ఇన్‌స్ట్రాగ్రామ్‌ ప్రోఫైల్‌తో అమ్మాయిలతో చాటింగ్‌ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న సుమంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడు సుమంత్‌ విజయవాడకు చెందిన వాడని, హైదరాబాద్‌లోని మణికొండలో ఉంటూ అమెజాన్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పారు. రాత్రి అయ్యిందంటే ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అమ్మాయిలా మారిపోయి మిగతా అమ్మాయిలతో చాటింగ్‌ చేయడమే పనిగా పెట్టుకున్నాడని, ఇంటర్నెట్‌ నుంచి యువతుల ఫొటోలు డౌన్‌లోడ్‌ చేసుకుని వాటితో నకిలీ ప్రోఫైల్‌ క్రియోట్‌ చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: లైంగిక వేధింపులు: అతడు ఆమెగా..)

ఇలా అమ్మాయి మాదిరిగా వాళ్లతో చాటింగ్‌ చేయడంతో అవతల వాళ్లు కూడా అమ్మాయి అనుకొని క్లోజ్‌గా మాట్లాడేవారన్నారు. ఈ క్రమంలో వారంతా తమ బలహినతలను నిందితుడితో చెప్పుకోవడం చేశారని, అది ఆయుధం చేసుకున్న నిందితుడు వారిని బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించేవాడన్నారు. అమ్మాయిల అశ్లీల ఫొటోలను నెట్‌నుంచి డౌన్‌లోడ్‌ చేసి అవి వారికి పంపించి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ నిందితుడు సుమంత్‌‌ కామావాంఛలు తీర్చుకునేవాడని తెలిపారు. కాగా ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు అధికం అవుతున్నాయని, ఇలాంటి వారిని గుర్తించడం కష్టం అన్నారు. యువత అపరిచితులతో చాటింగ్‌ చేయకూడదని, చాలా జాగ్రత్తలు పాటించడం మంచిదని ఏసీపీ హెచ్చారించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top