Hyderabad Crime News: Molestation On Divorced Woman At Banjara Hills - Sakshi
Sakshi News home page

Banjara hills: వివాహితతో రెండేళ్లుగా సహజీవనం..దూరం పెడుతోందని..

Apr 28 2022 2:44 PM | Updated on Apr 28 2022 3:15 PM

Hyderabad: Molestation On Divorced Woman At banjara Hills - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: వివాహితతో రెండేళ్లు సహజీవనం చేసిన ఓ యువకుడు కొంత కాలంగా ఆమెకు దూరంగా ఉంటూ మంగళవారం తెల్లవారుజామున బలవంతంగా ఆమె ఇంట్లోకి ప్రవేశించి బెల్ట్‌తో బాది ఆమె అంగీకారం లేకుండానే లైంగికి దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని ఫస్ట్‌లాన్సర్‌లో నివసించే వివాహిత(32)కు ఇటీవలే భర్తతో విడాకులు తీసుకుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు.

రెండేళ్ల క్రితం ర్యాపిడో బైక్‌ నడిపే రషీద్‌తో పరిచయం సహజీవనానికి దారి తీసింది. కొంత కాలం వీరి సహజీవనం బాగానే ఉన్నా ఇటీవల మనస్పర్థలకు దారి తీసింది. దీంతో ఆమె రషీద్‌ను దూరం పెట్టింది. రెండు నెలల క్రితం లంగర్‌హౌజ్‌  పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అక్కడి పోలీసులు మందలించి పంపించారు. అయినాసరే నిందితుడిలో మార్పు లేకపోగా ఆమె ఇంట్లోకి ప్రవేశించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిపై 376(2), 323, 417, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement