12సార్లు ఓటీపీ చెప్పాడు.. రూ.1.76 లక్షలు గోవింద

Hyderabad Man Say OTP To Cybercriminals SBI Redeem Points Expire - Sakshi

రీడిమ్‌ అంటే ఓటీపీ చెప్పిన నగర వాసి 

ఖాతా నుంచి రూ.1.76 లక్షలు స్వాహా

సాక్షి, సిటీబ్యూరో: ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డుకు సంబంధించిన రీడీమ్‌ పాయింట్లు ఎక్స్‌పైర్‌ అవుతున్నాయంటూ నగరవాసికి ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు రూ.1.76 లక్షలు కాజేశారు. కార్ఖానా ప్రాంతానికి చెందిన బాధితుడికి ఫోన్‌ చేసిన నేరగాళ్లు ఎక్స్‌పైరీ అయ్యే పాయింట్లను వెంటనే రీడీమ్‌ చేసుకోవాలని సూచించారు. దాని కోసమంటూ అతడి కార్డు వివరాలు తెలుసుకున్నారు. ఆపై బాధితుడి ఫోన్‌కు వచ్చిన ఓటీపీలను తెలుసుకుంటూ ఖాతా నుంచి డబ్బు కాజేశారు. మొత్తం 12 సార్లు ఓటీపీలు చెప్పిన బాధితుడు రూ.1.76 లక్షలు కోల్పోయాడు. 

అలాగే ఎస్‌బీఐ కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌ ఏర్పాటు చేసుకోవాలని భావించిన బోరబండ వాసి ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌ చేశాడు. అందులో కనిపించిన ఓ నెంబర్‌లో సంప్రదించగా.. వివిధ రకాలైన ఫీజుల పేరు చెప్పిన సైబర్‌ నేరగాళ్లు రూ.80,800 స్వాహా చేశారు. వీరిద్దరూ వేర్వేరుగా శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి.

చదవండి: ఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరిక!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top