వర్కర్‌పై కర్కశత్వం.. ఒళ్లంతా బెల్టు వాతలు

ఒళ్లంతా బెల్టు వాతలతో నరకయాతన
బెల్టుతో కొట్టడంతో పవన్‌కుమార్ వీపుపై వాతలు
పోలీసులను ఆశ్రయించిన బాధితుడు, నిందితుడి రిమాండ్
సాక్షి,జవహర్‌నగర్: టిఫిన్ సెంటర్‌లో పని చేస్తున్న వర్కర్‌పై ఓ యజమాని తన కర్కశత్వాన్ని చూపించాడు. రెండు నెలలుగా చిత్రహింసలకు గురిచేస్తూ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జమ్మిగడ్డ ప్రాంతంలో చోటుచేసుకుంది.
ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... కాప్రా జమ్మిగడ్డ ప్రాంతంలో నిససిస్తున్న తిప్పారపు పవన్‌కుమార్ నాలుగేళ్లుగా తన ఇంటి సమీపంలోని మణికంఠ టిఫిన్ సెంటర్‌లో పని చేస్తున్నాడు. కాగా హోటల్‌యజమాని తాడూరి అనిల్ గత రెండేళ్లుగా పవన్‌ను వేధిస్తూ చిత్రహింసలు గురిచేయడమే కాకుండా బెల్ట్‌తో ఒళ్లంగా దారుణంగా కొట్టాడు. బాధితుడు పవన్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసుకుని హోటల్ యజమాని తాడూరి అనిల్‌ను శువ్రవారం రిమాండ్‌కు తరలించారు.