క్లాస్‌లో ఫస్ట్‌.. ఆన్‌లైన్‌ క్లాసులని చెప్పి తలుపులు వేసి.. | Hyderabad: 9 Class Student Ends Her Life Banjarahills | Sakshi
Sakshi News home page

క్లాస్‌లో ఫస్ట్‌.. ఆన్‌లైన్‌ క్లాసులని చెప్పి తలుపులు వేసి..

Mar 9 2022 3:16 PM | Updated on Mar 9 2022 3:37 PM

Hyderabad: 9 Class Student Ends Her Life Banjarahills - Sakshi

నవిక( ఫైల్‌)

సాక్షి,బంజారాహిల్స్‌: యూసుఫ్‌గూడ సమీపంలోని శ్రీకృష్ణానగర్‌లో నివసించే ఏముల నవిక(13) అనే బాలిక మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న నవిక తల్లి విధులకు వెళ్లిన తర్వాత తన గదిలో ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మోహన్‌బాబు ఇంటికి వచ్చి తలుపు తట్టినా తెరవకపోవడంతో బెడ్‌రూమ్‌ కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కూతురు విగతజీవిగా కనిపించడంతో వెంటనే తలుపులు పగలగొట్టి ఆమెను అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాస్‌లకు హాజరవుతున్న నవిక క్లాస్‌లో ఫస్ట్‌ కాగా ఆ స్కూల్‌లోనే బ్రిలియంట్‌ స్టూడెంట్‌గా టీచర్లు మెప్పును పొందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement