భార్యపై అనుమానం.. బ్యూటీపార్లర్‌లో రాజు ఏం చేశాడంటే..? | Husband Attack On Wife At Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: భార్యపై అనుమానం.. బ్యూటీపార‍్లర్‌లో రాజు హల్‌చల్‌

May 14 2022 7:36 PM | Updated on May 14 2022 7:38 PM

Husband Attack On Wife At Hyderabad - Sakshi

భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని శ్రీనగర్ కాలనీలోని వెంకీస్ హెయిర్ అండ్ బ్యూటీ స్టూడియోలో రాజు హల్‌చల్‌ చేశాడు.

సాక్షి, హైదరాబాద్: నగరంలోని శ్రీనగర్‌కాలనీలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. బ్యూటీపార్లర్‌లో పనిచేస్తున్న తన భార్యపై అనుమానంతో భర్త దారుణానికి ఒడిగట్టాడు. దీంతో పార్లర్‌ యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వివరాల ప్రకారం.. శ్రీనగర్ కాలనీలోని వెంకీస్ హెయిర్ అండ్ బ్యూటీ స్టూడియోలో సుమతి(25) అనే మహిళ మూడు నెలలుగా పనిచేస్తోంది. ఇదిలా ఉండగా, తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే భర్త రాజు.. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో, శనివారం పార్లర్‌కు వెళ్లిన రాజు.. సుమతిపై హత్యాయత్నం చేశాడు. రాజు చేతిలో కత్తి ఉండటంతో బ్యూటీ పార్లర్ సిబ్బంది అతడిని వారించారు. 

ఈ క్రమంలో రాజు.. భార్య సుమతిని తీవ్రంగా కొట్టడంతో పాటు గొంతునొక్కి ఆమెను చంపడానికి ప‍్రయత్నించాడు. అనంతరం కత్తితో పార్లర్‌ సిబ్బందిని బెదిరించాడు. దీంతో, వెంకీస్ హెయిర్ అండ్ బ్యూటీ స్టూడియో యజమాని పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. రాజుపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత మనవడిపై కేసు పెట్టిన భార్య.. విషయం ఏంటంటే..?

Advertisement
 
Advertisement
Advertisement