పరువుహత్య: ప్రేమించి పరువు తీసిందని..

Honor Deceased: Young Girl Expired In Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు : మాగడి తాలూకా బెట్టహళ్లి గ్రామానికి చెందిన హేమలత (18) అనే యువతి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. పరువు హత్యగా నిర్ధారించారు. ఆమె తండ్రి కృష్ణప్ప(48), పెదనాన్న కుమారుడు చేతన్‌(21)ను నిందితులుగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. మరో మైనర్‌ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను శనివారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.  (చెక్‌పోస్టులో కరెన్సీ కట్టలు)

ఏం జరిగిందంటే...
హేమలత కుదూరు కళాశాలలో బీకాం చదువుతోంది. ఇదే కళాశాలలో చదువుతున్న అన్యమతస్తుడయిన యువకున్ని మూడేళ్లుగా ప్రేమిస్తోంది. ఈ విషయంపై ఇరువైపుల పెద్దల పంచాయితీ కూడా జరిగింది. అయితే అన్యమతస్తుడిని ప్రేమించి తమ పరువు తీసిందంటూ హేమలతపై ఆమె తండ్రి కోపంతో ఉండేవారు.

ఈక్రమంలో హేమలత కనిపించకుండా పోయింది. ఈనెల 11న తోటలో పూడ్చిన స్థితిలో విగతజీవిగా కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పరిశీలించగా హత్యకు గురైనట్లు నిర్ధారించారు. ప్రియుడే హత్య చేశాడని వదంతులు పుట్టించారు. పోలీసుల విచారణలో తండ్రి, సోదరుడు, మరో బాలుడు కలిసి ఆమెను అంతమొందించారని వెల్లడైంది.  సామూహిక హత్యాచారం కాదని తేల్చారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top