దారుణం.. ఉద్యోగాలు ఇప్పిస్తామని మహిళలను తీసుకెళ్లి.. 

Harassment Of Women In The Name Of Jobs At Madya Pradesh - Sakshi

దేశంలో ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలను లైంగికంగా వేధించడం, దాడులు చేయడం వంటివి మాత్రం ఆగడం లేదు. తాజాగా మహిళలను ఉద్యోగాల పేరుతో మోసం చేసి వారి చేత అశ్లీల నృత్యాలు చేయాలని బలవంతం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. జబల్​పుర్​కు చెందిన సన్నీ సొంధియా, నిధీ సొంధియా దంపతులు, దర్భంగాకు చెందిన పింటూ కుమార్​ ఠాకుర్​లతో కూడిన ముఠా ఉద్యోగాల పేరుతో మహిళలను వేధింపులకు గురిచేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మహిళలు, యువతులను నమ్మించి వారిని వివిధ ప్రాంతాలకు అక్రమరవాణా చేస్తూ.. పెళ్లి వేడుకల్లో వారి చేత బలవంతంగా అశ్లీల నృత్యాలు చేయించేవారు. 

ఇదిలా ఉండగా.. ఉద్యోగాల పేరుతో కొందరు మహిళలను ఈనెల 11వ తేదీన ఈ ముఠా జబల్‌పూర్‌కు తరలిస్తుండగా పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బీహార్​ పోలీసుల సాయంతో జాయింట్​ ఆపరేషన్​ నిర్వహించి మోతీహరీ ప్రాంతంలో నిందితులను అరెస్ట్​ చేశారు. ఈ క్రమంలో నలుగురు మహిళలను రక్షించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top