లావుగా ఉన్నావంటూ భార్యను.. | Gujarat Man Abandons Wife Because Of Her Fat Body | Sakshi
Sakshi News home page

లావుగా ఉన్నావంటూ భార్యను..

Sep 23 2020 8:47 PM | Updated on Sep 23 2020 8:52 PM

Gujarat Man Abandons Wife Because Of Her Fat Body - Sakshi

అహ్మాదాబాద్‌ : భార్య లావుగా ఉందన్న కారణంగా ఆమెను ఇంటినుంచి బయటకు గెంటేశాడో భర్త. ఈ సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అహ్మదాబాద్‌, మహిళా వెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలోని వస్న రెసిడెంట్‌కు చెందిన ఓ మహిళకు 2017లో వివాహం అయింది. ఆరు నెలలు భార్యభర్తలిద్దరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత లావుగా ఉన్నావంటూ భర్త ఆమెను వేధించటం మొదలుపెట్టాడు. (భర్తకు గండం ఉందని వివాహిత మెడలో తాళి కట్టి..)

తన తల్లిదండ్రుల బలవంతం కారణంగానే ఆమెను పెళ్లి చేసుకున్నానని చెప్పి ఎగతాళి చేసేవాడు. ఓ నెల క్రితం ఇళ్లు కొనడానికి ఆమె వద్దనుంచి దాదాపు 3 లక్షల రూపాయలు ఇప్పించుకున్నాడు. ఆ వెంటనే ఆమెను ఇంటినుంచి బయటకు గెంటేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి, భర్త, అతడి సోదరులపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement