బాలుడిని బలి తీసుకున్న కొబ్బరి ముక్క | Four Year Old Boy Deceased After Coconut Pieces Stuck Throat | Sakshi
Sakshi News home page

బాలుడిని బలి తీసుకున్న కొబ్బరి ముక్క

Feb 12 2022 6:43 AM | Updated on Feb 12 2022 6:43 AM

Four Year Old Boy Deceased After Coconut Pieces Stuck Throat - Sakshi

చెన్నై: గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుని మూడున్నరేళ్ల బాలుడు శుక్రవారం మృతి చెందాడు. పొన్నేరి సమీపంలోని  పాక్కం గ్రామానికి చెందిన వసంత్‌కు మూడు న్నరేళ్ల కొడుకు సంజీశ్వరన్‌ ఉన్నాడు. ఇంట్లో వంట చేయడం కోసం కొబ్బరిని ముక్కలు చేసి ఉంచారు.

అక్కడే ఆడుకుంటున్న సంజీశ్వరన్‌ ఆ కొబ్బరి ముక్కలను తిన్నాడు. అవి గొంతులో ఇరుక్కుపోవడంతో స్పృహ కోల్పోయాడు. తల్లిదండ్రులు వెంటనే చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.  తిరుపాలైవనం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement