చిరుతపులి పిల్లను చంపి వండుకు తిన్నారు

సాక్షి, చెన్నై: చిరుతపులి పిల్లను చంపి, ఆ మాంసాన్ని వండుకు తిన్న ఐదుగురు వేటగాళ్లను తమిళనాడులోని నీలగిరి జిల్లా అటవీ శాఖ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు.అటవీ గ్రామంలోకి దారి తప్పి వచ్చిన ఓ చిరుతపిల్లను కొందరు వ్యక్తులు వేటాడి హతమార్చినట్టు శనివారం అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులకు అక్కడి ఓ పంట పొలంలో చిరుతపులిని వేటాడిన ఆనవాళ్లు లభించాయి. విచారణను వేగవంతం చేయగా ఆదివారం ఉదయం అదే ప్రాంతానికి చెందిన వినోద్, కురియ, బిను, కుంజప్పన్, విన్సంట్‌లను అరెస్టు చేశారు. వారంతా కలసిదాని మాంసాన్ని వండుకొని తిన్నట్లు గుర్తించారు.
Kerala: Five persons were arrested for allegedly killing a leopard and consuming its meat in Idukki district.
(23.01.2021) pic.twitter.com/GTTyFRtzHq
— ANI (@ANI) January 24, 2021
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి