రాజధాని అమరావతి అసైన్డ్‌ భూముల స్కామ్‌లో ఐదుగురు అరెస్ట్‌

Five Arrested In Capital Amaravati Assigned Land Scam - Sakshi

సాక్షి, విజయవాడ: రాజధాని అసైన్డ్‌ భూముల కుంభకోణం కేసులో ఐదుగురిని  సీఐడీ అరెస్ట్‌ చేసింది. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయలు, కొట్టి దొరబాబులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. 1100 ఎకరాల అసైన్డ్‌భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని అభియోగం. ఇందులో 169.27 ఎకరాలకు సంబంధించి విచారణకు సంబంధించి ఐదుగురిని సీఐడీ అరెస్టు చేసింది. కేసులో ప్రధాన నిందితుడు టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ.. బంధువులు, పరిచయస్తుల పేరుతో బినామీ లావాదేవీలు జరిపినట్టుగా అభియోగాలు ఉన్నాయి.
చదవండి: అరుదైన రికార్డ్‌.. ఆ విషయంలో దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌  

అనంతవరం, కృష్ణాయపాలెం, కూరగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంటకపాలెం గ్రామాల్లో వేర్వేరు సర్వే నంబర్లలో సుమారు 89.8 ఎకరాల భూమిని మాజీ మంత్రి నారాయణ తన బంధువులు, పరిచయస్తుల పేరుతో అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

రామకృష్ణా హౌసింగ్‌ డైరెక్టర్‌ ఖాతాల ద్వారా పేమెంట్లు చేసి ఈ వ్యవహారాలు చేశారని నిర్ధారణ అయ్యింది.ఈకేసులో ఇతర నిందితులు వారి తరఫు మనుషులు మరో 79.45 ఎకరాల అసైన్డ్‌ ల్యాండ్స్‌ను అక్రమంగా కొనుగోలు చేశారని వెల్లడైంది.ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి నారాయణ – రామకృష్ణా హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మధ్య రూ.15 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నిర్ధారణ అయ్యింది.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top