గ్యాస్‌ సిలిండర్లు పేలి అగ్నిప్రమాదం | Fire Accident With Gas Cylinder Blast in Gagan Mahal | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సిలిండర్లు పేలి అగ్నిప్రమాదం

Aug 17 2020 9:46 AM | Updated on Aug 17 2020 9:46 AM

Fire Accident With Gas Cylinder Blast in Gagan Mahal - Sakshi

ప్రమాదం జరిగిన అపార్ట్‌మెంట్‌ వద్ద ఫైర్‌ ఇంజిన్‌

చిక్కడపల్లి: దోమలగూడ గగన్‌మహల్‌ కాలనీలో ఆదివారం గ్యాస్‌ సిలిండర్లు పేలి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  ఇన్‌స్పెక్టర్‌ పాలడుగు శివశంకర్‌రావు కథనం ప్రకారం... గగన్‌మహల్‌ కాలనీలోని తులిప్‌ రెసిడెన్సీ ఫ్లాట్‌ నంబర్‌  201, 301ల్లో రంజీత్‌ సింగ్‌ కుటుంబం నివాసం ఉంటోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు 201 ఫ్లాట్‌లోని వంట గది నుంచి పొగ రావడంతో ఇంట్లోవారు బయటకు పరుగు తీయడంతో పాటు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి అపార్ట్‌మెంట్‌ వాసులను కిందకు దించారు.

అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఫ్లాట్‌ నం. 201 పైన ఉన్న 301కి కూడా మంటలు వ్యాపించాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్‌ ఇంజిన్ల సహాయంతో తీవ్రంగా కష్టించి మంటలను ఆర్పివేశారు. ఘటనా స్థలంలో రెండు గ్యాస్‌ సిలిండర్లు పేలి పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ప్రమాద తీవ్రత పెరగకుండా, అదే విధంగా ఎటువంటి ప్రాణనష్టం కలగకుండా చాకచక్యంగా అపార్ట్‌మెంట్‌ వాసులను కిందకు తీసుకొచ్చిన ఎస్‌ఐలు ప్రేమ్‌కుమార్, పచ్చు బాల్‌రాజ్, సిబ్బంది వీరేందర్, భీంసింగ్, అరుణ్, శేఖర్‌ను పోలీస్‌ ఉన్నతాధికారులు అభినందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement