హరిద్వార్‌ ధర్మసంసద్‌ ప్రసంగాలపై కేసు నమోదు

FIR lodged over hate speeches at Dharma Sansad in Haridwar - Sakshi

డెహ్రాడూన్‌: మైనారిటీలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వసీం రజ్వీ అలియాస్‌ జితేంద్ర నారాయణ్‌ త్యాగి, తదితరులపై కేసు నమోదైంది. వారిపై ఐపీసీ 153 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు హరిద్వార్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ రకీందర్‌సింగ్‌ తెలిపారు.  అదేవిధంగా, గత వారం హరిద్వార్‌లో ధర్మసంసద్‌   నిర్వహించి న,  ప్రసంగించిన వారిపై చర్యలు తీసుకోవా లని టీఎంసీ  ప్రతినిది సాకేత్‌ గోఖలే జ్వాలాపూర్‌లో ఫిర్యాదు చేశారు. 

రెచ్చగొట్టే వ్యాఖ్యలు గర్హనీయం
హిందుత్వవాదం పేరుతో కొందరు చేస్తున్న ద్వేషపూరిత వ్యాఖ్యల ద్వారా హింస జరుగుతోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దానికి అన్ని మతాలు మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన శుక్రవారం ట్వీట్‌ చేశారు. హింసను ప్రేరేపిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండ్‌ చేశారు. మాజీ ప్రధానిని హత్య చేయాలని పిలుపునివ్వడం, వివిధ మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేయడం హీనమైన చర్యన్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరించేలా ఆ వ్యాఖ్యలున్నాయని ఆమె ట్వీట్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top