యువతి గురించి తెలియక పిచ్చి వేషాలు వేసి అడ్డంగా బుక్కయ్యాడు! | Female Passenger Choke Hold After He Molested On Bus In Brazil | Sakshi
Sakshi News home page

యువతి గురించి తెలియక పిచ్చి వేషాలు వేసి అడ్డంగా బుక్కయ్యాడు!

Oct 28 2021 10:39 AM | Updated on Oct 28 2021 10:56 AM

Female Passenger Choke Hold After He Molested On Bus In Brazil - Sakshi

ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న మహిళలు, బాలికలు ఎక్కడో ఒక దగ్గర లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. కొందరు ఆకతాయిలైతే బరితెగించి చుట్టూ ఎందరు ఉన్నా మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా బస్సులో ఒంటరిగా కుర్చన్న యువతితో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. తీరా చూస్తే ఆమె ఓ లేడీ బ్రూస్లీ కావడంతో అతను దెబ్బలు తినడంతో పాటు అందరి ముందు అడ్డంగా బుక్కయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. అక్టోబర్‌ 20న బ్రెజిల్‌లోని బెలెమ్‌కు చెందిన ఓ మహిళ బస్సులో ఇంటికి వెళుతోంది. ఆ సమయంలో బస్సు ప్యాసింజర్లతో పుల్‌గా ఉంది. ఆమె ఎదురుగా నిలుచున్న ఓ వ్యక్తి పిచ్చి చేష్టలు మొదలుపెట్టాడు. బస్సులో ప్యాసింజర్లు అంత మంది ఉన్నా తన పైశాచికత్వాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. చుట్టూ ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారని ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో చిర్రెత్తు కొచ్చిన ఆ యువతి అతడి ముక్కుపై గట్టాగా ఒక్క పంచ్‌ ఇచ్చింది. దెబ్బకు ఆ వ్యక్తికి కళ్లు బైర్లు కమ్మాయి. వెంటనే వెనకాల నుంచి గొంతును చేతుల్తో చుట్టి పడేసింది.

దీంతో ఊపిరాడక అల్లాడిపోయాడు. చివరికి డ్రైవర్‌ బస్సును నేరుగా పోలీస్‌స్టేషన్‌ దగ్గరకు తీసుకెళ్లడంతో అతడిని పోలీసులకు అప్పగించారు. కాగా గత ఏడాది కూడా బస్సులో తనకు ఇలాంటి అనుభవమే ఎదురైందని అందుకే ఆత్మరక్షణ కోసం తాను ప్రత్యేకంగా ముయే థాయ్, కాపోయిరాలను కళను నేర్చుకున్నట్లు ఆ యువతి తెలిపింది. బ్రెజిలియన్ చట్టం ప్రకారం లైంగిక వేధింపుల నేరానికి పాల్పడినట్లు రుజువైతే, నిందితుడికి ఏడాది నుంచి ఐదు సంవత్సరాల మధ్య జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

చదవండి: జైలుకెళ్లొచ్చాక కూడా బిడ్డలపై అత్యాచారం చేస్తా: తండ్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement