హర్ష మందర్‌ ఇళ్లల్లో ఈడీ సోదాలు

ED raids premises linked to human rights activist Harsh Mander - Sakshi

న్యూఢిల్లీ: రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, మానవ హక్కుల ఉద్యమకారుడు హర్ష మందర్‌(66)కు చెందిన ఇళ్లల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) గురువారం సోదాలు నిర్వహించింది. మనీ లాండరింగ్‌ ఆరోపణలపై విచారణలో భాగంగానే ఈ సోదాలు జరిపినట్లు అధికారులు చెప్పారు. ఢిల్లీలో ఇళ్లు, ఎన్జీఓ కార్యాలయంలో సోదాలు జరిపారు. హర్ష మందర్‌కు సంబంధం ఉన్న రెండు ఎన్జీఓల ఆర్థిక, బ్యాంకింగ్‌ కార్యకలాపాల పత్రాలను ఈడీ అధికారులు పరిశీలించారు. హర ్షమందర్‌ గురువారం ఉదయమే తన భార్యతో కలిసి జర్మనీకి పయనమయ్యారు. సామాజిక న్యాయం, మానవ హక్కులపై ఆయన వార్తా పత్రికల్లో సంపాదకీయాలు రాస్తుంటారు. పుస్తకాలు రచిస్తారు. హర్ష మందర్‌ డైరెక్టర్‌గా ఉన్న సెంటర్‌ ఫర్‌ ఈక్విటీ స్టడీస్‌(సీఎస్‌ఈ) అనే సంస్థపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top