ఓ వైపు అమ్మాయిలు మరోవైపు డ్రగ్స్‌ | drugs Catch in Hyderabad | Sakshi
Sakshi News home page

ఓ వైపు అమ్మాయిలు మరోవైపు డ్రగ్స్‌

Nov 17 2020 6:22 PM | Updated on Nov 17 2020 6:41 PM

drugs Catch in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాజధానిలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత మరోసారి కలకలం రేపింది. గోవా నుంచి పెద్ద మొత్తంలో హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను తీసుకువస్తున్న ఇద్దరు వ్యక్తులను నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ పబ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న సల్మాన్‌తో పాటు హైమద్‌ అనే వ్యక్తిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.  సల్మాన్ ద్వారా పది పబ్ లకు డ్రగ్స్  సరఫరా అవుతున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. డ్రగ్స్‌ను  సరఫరా చేస్తున్న పబ్స్ డాటాను పోలీసులు బయటకు  తీసే ప్రయత్నం చేస్తున్నారు.

కేవలం డ్రగ్స్‌ మాత్రమే కాకుండా మరొకవైపు ఈశాన్య రాష్ట్రాలతో పాటు  గోవా నుంచి అమ్మాయిలను  కూడా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. అమ్మాయిల ద్వారా పబ్‌కు వచ్చే వారికి అమ్మాయిల ద్వారా పబ్ కు  వచ్చే వారికి డ్రగ్స్  సరఫరా చేసిన సల్మాన్ డ్రగ్స్  సరఫరా  చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. అంతేకాకుండా అమ్మాలయితో వీరిద్దరూ వ్యభిచారం సైతం నడిపిస్తునట్లు విచారణ ద్వారా తెలుస్తోంది. 


 

Advertisement
 
Advertisement
Advertisement