సొంత సోదరిపై కాల్పులు జరిపిన సోదరుడు

Delhi Teen Shot At By Elder Brother For Chatting To Man - Sakshi

న్యూఢిల్లీ : సొంత సోదరిపై పిస్టల్‌తో కాల్పులు జరిపిన సంఘటన ఈశాన్య ఢిల్లీలో గురువారం చోటు చేసుకుంది. డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ వేద్‌ ప్రకాశ్‌ సూర్య కథనం ప్రకారం వెల్కమ్‌ ఏరియా, జంతా కాలనీకి చెందిన మైనర్‌ బాలిక వరుసకు బావ అయిన అమీర్‌తో కొంత కాలంకిందట పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలోనే తన అన్నయ్యకు తెలియకుండా తండ్రి మెబైల్‌తో తరుచూ అమీర్‌తో మాట్లాడటం ప్రారంభించింది. ఈ విషయం కాస్తా సోదరి అన్నకు తెలియడంతో ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది.

ఈ నేపథ్యంలో అమీర్‌తో మాట్లాడవద్దని ఆమెను కోరాగా దానికి బాలిక నిరాకరించింది. దీంతో సోదరిపై ఆగ్రహానికి గురైన అన్న.. క్షణికావేశంలో పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. స్థానికుల సహాయంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 307 హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top