హత్య చేసి పారిపోతూ....మృతదేహంతో సెల్ఫీ వీ‍డియో! | Sakshi
Sakshi News home page

చిచ్చు రేపిన తాగుడు అలవాటు... ఖతం చేసి సెల్ఫీ వీడియో!

Published Sat, Aug 20 2022 11:28 AM

Delhi Man Allegedly Hit Hammer His Tenant Took Selfi His Body - Sakshi

చిన్నచిన్న వాటికే పెద్దగా రియాక్ట్‌ అయిపోయి జీవితాలను నాశనం చేసుకుని కటకటాల పాలవుతున్నారు చాలామంది. ఏ చిన్న బాధ, అవమానం కలిగిన అవతలవాళ్లను కడతేర్చాలనేంత ఉద్రేకానికి గురవ్వడం...ఇరు జీవితాలను తెలియకుండానే చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడోక వ్యక్తి చేసి కటకటాల పాలయ్యాడు.

వివరాల్లోకెళ్తే...ఢిల్లీలోని పంకజ్‌ అనే వ్యక్తి సురేష్‌ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఐతే పంకజ్‌ మద్యానికి బానిసై తరచు తాగుతూ ఇంటికి రావడంతో యజమాని సురేష్‌కి చిర్రేత్తుకొచ్చి గట్టిగా చివాట్లు పెడతాడు. ఆ తర్వాత పంకజ్‌ ఇంటి యజమానికి సురేష్‌, అతని కొడుకు జగదీష్‌లకు క్షమాపణలు చెప్పడంతో గొడవ సద్దుమణిగిపోయింది. ఐతే పంకజ్ ఇంటి యజమాని సురేష్‌ చాలా ఘోరంగా అవమానంగా తిట్టడాని, అందుకే తాను ఇక ఇంట్లో ఉండలేనని కొడుకు జగదీష్‌కి ఫోన్‌ చేసి చెబుతాడు.

అంతేకాదు పంకజ్‌ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతాడు ‍కూడా. ఐతే జగదీష్‌కి పంకజ్‌ తీరు మీద అనుమానం వచ్చి తండ్రి సురేష్‌ ఇంటికి వచ్చి చూస్తాడు. అంతే అక్కడ తండ్రి మృతి చెంది ఉండటం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ ట్రేసింగ్‌ పరికరాల సాయంతో 250 కి.మీ దూరం వెంబడించి మరీ నిందితుడు పంకజ్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

విచారణలో సురేష్‌ని సుత్తితో కొట్టి చంపినట్లు తెలిపాడు. అంతేకాదు చంపి వెళ్లిపోతూ సురేష్‌ మృతదేహంతో ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పంకజ్‌ వెళ్లిపోతూ తన వెంట సురేష్‌ ఐడీ కార్డు, మొబైల్‌ ఫోన్‌ని కూడా తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఐతే నిందితుడు తన మీద అనుమానం రాకుండా అక్కడ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడూ జగదీష్‌కి వేర్వేరు ప్రదేశాల నుంచి పోన్‌లు చేస్తూ ఉన్నాడు. ఆ భయమే అతన్ని పోలీసులకు సునాయసంగా చిక్కేలా చేసింది.

(చదవండి: రాజస్థాన్‌ దళిత చిన్నారి మృతి వ్యవహారంలో బిగ్‌ ట్విస్ట్‌.. నీళ్ల కుండే లేదంట!!)

Advertisement
 
Advertisement
 
Advertisement