డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య | Degree student commits suicide | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

Jun 14 2023 8:06 AM | Updated on Jun 14 2023 8:06 AM

Degree student commits suicide - Sakshi

శ్రీకాకుళం: మండలంలోని హంసరాళి పంచాయతీ కొయిటాసాయి గ్రామానికి చెందిన సవర ఢిల్లేశ్వరి(19) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పెరట్లో గల మామిడిచెట్టుకు ఉరి వేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక గిరిజనులు హుటాహుటిన హరిపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే ఢిల్లేశ్వరి మరణించినట్టు వైద్యులు చెప్పారు. కుటుంబ వివాదాల కారణంగానే ఢిల్లేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు చెబుతున్నారు.

మృతురాలి తల్లి సవర వాణిశ్రీ ఫిర్యాదు మేరకు మందస ఎస్‌ఐ ఎనుకోటి రవికుమార్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి హరిపురం సీహెచ్‌సీలో పోస్టుమార్టం నిర్వహించారు. పెద్ద కుమార్తెకు వివాహం చేసిన ఢిల్లేశ్వరి తల్లిదండ్రులు హరికృష్ణ, వాణిశ్రీలు చిన్న కుమార్తెను చదివించి ప్రయోజకురాలిగా చేయాలనుకున్నారు. ఇంతలో ఆత్మహత్య చేసుకోవడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement