సినిమాలో హీరో మాదిరి కూతురుని రక్షించుకున్న రోజువారీ కూలీ

Daily Wage Labourer Rescued His Kidnapped 12 Year Old Daughter - Sakshi

కిడ్నాప్‌కి గురైతే దొరకుతారన్నగ్యారంటి ఉండకపోగా బతికే ఉంటారన్న నమ్మకమూ ఉండదు. చాలా వరకు ఇలాంటి కిడ్నాప్‌ కేసుల్లో బాదితులను హతమార్చడం లేదంటే అమ్మేయడం వంటివి జరుగుతుంటాయి. సరైనా అధారాలు ఉంకపోవడంతో చాలా వరకు ఇలాంటి కేసులు పెండింగ్‌లోనే ఉండిపోతాయి. ఐతే ఇక్కడొక తండ్రి కిడ్నాప్‌ అయిన కూతురుని సినిమాలో హీరో మాదిరి గాలించి రక్షించుకున్నాడు.

వివరాల్లోకెళ్తే.... పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ముంబైలోని సబర్బన్‌ బాంద్రాలో రోజువారీ కూలీ తమ ఇంటి వద్ద 12 ఏళ్ల కూతురు కిడ్నాప్‌కి గరయ్యందంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఐతే ఆ అమ్మాయి తండ్రి ఇరుగు పొరుగువారిని విచారించి నిందితుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు.

ఆ అమ్మాయి కిడ్నాప్‌కి గురయ్యిన రోజు తల్లికి ఏదో సాకుతో బయటకు వెళ్లిందనే విషయాన్ని తెలుసుకుని ఆ దిశగా తెలిసినవాళ్లందర్నీ ఆరా తీయడం మెదలు పెట్టాడు. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి నిందుతుడు షాహిద్‌ ఖాన్‌(24)తో వెళ్లినట్లు తెలుసుకుంటాడు. అంతేకాదు ఆ వ్యక్తి తన ఇంటికి సమీపంలోని వస్త్రాల తయారీలో ఉద్యోగం చేస్తుస్నట్లుగా తెలుసుకుంటాడు.

దీంతో ఆ తండ్రి ఆ నిందితుడు కుటుంబం అలీఘర్‌ సమీపంలోని ఐత్రోలి గ్రామంలో ఉంటుందని తెలుసుకుని... పోలీసులు, స్థానికుల సాయంతో తన కూతురుని రక్షించుకుంటాడు. సదరు నిందితుడు ఆ అమ్మాయిని తనతో షాపింగ్‌కి రావాలంటూ కుర్లాకు తీసుకువెళ్లి..అక్కడ నుంచి సూరత్‌కి బస్సు ఎక్కి, రైలులో ఢిల్లికి చేరుకున్నట్లు తెలిపాడు. దీంతో పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

(చదవండి: గేమింగ్‌ యాప్‌ స్కామ్‌.... సుమారు రూ. 12 కోట్లు స్వాధీనం)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top