విద్యుత్‌ షాక్‌తో దంపతులు మృతి  | Couple Deceased With Electric Shock In Vellore | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో దంపతులు మృతి 

Oct 6 2021 8:13 AM | Updated on Oct 6 2021 8:13 AM

Couple Deceased With Electric Shock In Vellore - Sakshi

జయప్రకాష్, లక్ష్మి (ఫైల్‌) 

సాక్షి, వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి తాలుకా ఉల్లిపుదూరు గ్రామానికి చెందిన జయప్రకాష్‌(30) ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతని భార్య లక్ష్మి(26). వీరికి వివాహం జరిగి ఏడాది అవుతుంది. సోమ వారం రాత్రి జయప్రకాష్‌ భార్యతో కలిసి వ్యవసాయ బావి వద్ద ఉన్న పశువును పట్టుకొచ్చేందుకు వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో దారిలో అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగలు తగిలి పశువుతో పాటు దంపతులు జయప్రకాష్, లక్ష్మి అక్కడిక్కడే మృతి చెందారు.

బావి వద్దకు వెళ్లిన దంపతులు రాత్రి ఇంటికి రాకపోవడంతో మంగళవారం ఉదయం బంధువులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూశారు. వారు విగత జీవులుగా పడి ఉండడాన్ని గుర్తించి తిరువలం పోలీసులకు సమాచారం అందించారు. పందుల కోసం విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేసిన వ్యక్తులు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: (తల్లీకొడుకును బలిగొన్న బజ్జీలు) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement