తల్లీకొడుకు ప్రాణాలు తీసిన బజ్జీలు

Mother and Son Died After Eating Poisonous Bajjis In Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు (దొడ్డబళ్లాపురం): విషపూరిత బజ్జీలు తిని తల్లీకొడుకు మృతి చెందిన సంఘటన బెళగావి తాలూకా హుదలి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పార్వతి (53), కుమారుడు సోమనింగప్ప (28) కూలీ పని చేసుకుంటూ జీవిస్తుంటారు.

సోమవారం ఇద్దరూ ఇంట్లో బజ్జీలు చేసుకుని తిన్నారు. రాత్రికి  ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. ఇద్దరినీ స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక మృతిచెందారు. బజ్జీ­ల్లో పురుగులు మందు కలిసి ఉంటుందని, ఇది అనుకోకుండా జరిగిందా, లేక ఎవరైనా కుట్ర పన్ని చేశారా? అనేది తేలాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

చదవండి: (నటి సంజన వీరంగం..!) 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top