పెళ్లికి పిలవలేదని.. పిల్లల ఆటను సాకుగా తీసుకుని..

Conflict Between Two Families In East Godavari - Sakshi

పెళ్లికి పిలవలేదన్న ఉక్రోషంతో ఘర్షణ

రెండు కుటుంబాల్లోని ఇద్దరికి గాయాలు

ఇరు వర్గాల ఫిర్యాదులపై కేసు నమోదు

అమలాపురం టౌన్‌(తూర్పుగోదావరి): ఓ ఇంట వివాహానికి తమను పిలవలేదన్న ఉక్రోషంలో ఉన్న మరో కుటుంబ యజమాని ఆ ఇరు కుటుంబాల్లోని పిల్లల ఆటను సాకుగా తీసుకుని గొడవకు దిగి గాయాలయ్యే వరకు తెచ్చుకున్నారు. సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌ తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని కొంకాపల్లిలో పనసా వెంకటేశ్వరరావు ఇంటిలో శుక్రవారం వివాహం జరిగింది.

ఈ శుభకార్యానికి పొరుగున ఉన్న అల్లాడ బాబులు కుటుంబాన్ని పిలవలేదు. కాగా ఇరు కుటుంబాల చిన్నారులూ పెళ్లింట్లో ఆడుకుంటుంగా ఒకరు అల్లరి చెయ్యకుండా ఆడుకోండని వారించారు. ఈ విషయాన్ని సాకుగా తీసుకుని అల్లాడ బాబు ఘర్షణకు దిగారు. కర్రలతో కొట్టుకున్న ఈ ఘర్షణలో వెంకటేశ్వరరావు, బాబులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరూ స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:
వీడని మిస్టరీ: అంతులేని ‘కొడనాడు’ కథ
లేడీస్‌ హాస్టల్‌లోకి ప్రవేశించి యువతిపై అత్యాచారం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top