
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం ముత్యాలపాడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముత్యాలపాడులోని అరుంధతతీయ పాలెంలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతలకు దారి తీసింది. పాత కక్షల నేపథ్యంలో రెండు వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి.
సుధా, రాముడు, పెంచలయమ్మ అనే ముగ్గురి పై సుమారు 15 మంది దాడికి దిగారు. కర్రలు, బీరు బాటిళ్లు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు ఈ ఘటనలో రెండు వర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.