కుక్కపిల్లపై మోజుతో ఆ యువకుడు ఏం చేశాడంటే.. చివరికి..

Clash For Puppy In Anantapur District - Sakshi

పెనుకొండ(అనంతపురం జిల్లా): కుక్క పిల్ల కోసం చోటు చేసుకున్న  ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు. వివరాలు.. పెనుకొండ మండలం మంగాపురంలో రైతు అమరనాథరెడ్డి తన పొలంలోని షెడ్‌ వద్ద ఆదివారం ఉదయం ఓ కుక్క పిల్లను కట్టి ఉంచాడు. కుక్కపిల్లపై మోజుతో దానిని అదే గ్రామానికి చెందిన యువకుడు శబరీష్‌ ఎత్తుకెళ్లాడు. కాసేపటి తర్వాత ఈ విషయం తెలుసుకున్న అమరనాథరెడ్డి.. వెంటనే శబరీష్‌ను మందలించాడు.

చదవండి: పాపం ఏమైందో గానీ పెళ్లయిన నెలకే జవాను, భార్య ఆత్మహత్య

ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి కొట్టుకున్నారు. అంతటితో ఆగకుండా శబరీష్‌ ఇంటికి వెళ్లి తన సోదరుడు మంజునాథరెడ్డికి విషయం తెలిపి.. అమరనాథరెడ్డి వద్దకు పిలుచుకెళ్లాడు. ఆ సమయంలో ఘర్షణ చోటు చేసుకుని పరస్పరం దాడి చేసుకున్నారు. ముగ్గురికీ గాయాలయ్యాయి. ఘర్షణకు సంబంధించి బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top