చిన్నారి కేసులో కీలక మలుపు: పోలీసుల అదుపులో రాజు స్నేహితుడు

Childo Molestation Case: Raju Friend In Police Under Control - Sakshi

పారిపోయేముందు కలిసిన చివరి వ్యక్తి ఇతడే

ఎల్బీనగర్‌లో వెన్నంటే స్నేహితుడు

విచారణ చేపడుతున్న పోలీసులు

ఇక రాజు చిక్కినట్టే..?

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సింగరేణి కాలనీ ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో కీలక మలుపు తిరిగింది. నిందితుడు రాజు కోసం గాలిస్తుండగా అతడి స్నేహితుడు పోలీసులకు లభించాడు. హైదరాబాద్ టాస్క‌ఫోర్స్ అదుపులో నిందితుడు రాజు స్నేహితుడు దొరికాడు. పోలీసులు సీసీ ఫుటేజ్‌ పరిశీలించగా రాజు ఎల్బీనగర్ నుంచి ఉప్పల్‌ వైపు వెళ్లినట్లు గుర్తించారు. అయితే రాజుకు తోడుగా ఎల్బీనగర్‌ వరకు అతడి స్నేహితుడు వచ్చాడు. సీసీ ఫుటేజ్‌లో అతడు కూడా కనిపించాడు.  అనంతరం ఎల్బీనగర్‌ నుంచి రాజు ఒంటరిగా వెళ్లారు.
చదవండి: ‘రాజు’ కోసం వేట.. తెలంగాణ పోలీసుల భారీ సెర్చ్‌ ఆపరేషన్‌

అయితే పారిపోయే ముందు రాజు ఎల్బీనగర్‌లో ఆటో దొంగతనానికి యత్నించాడు. ఆటో డ్రైవర్ అప్రమత్తతో రాజు పరారయ్యాడు. అక్కడి నుంచి నాగోల్ వరకు బస్సులో వెళ్లాడు. నాగోల్‌లోని ఓ వైన్ షాప్‌ వద్ద మద్యం సేవించి అటు నుంచి బస్సులో ఉప్పల్ వెళ్లాడు. అక్కడి నుంచి ఘట్‌కేసర్ వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. అదుపులోకి తీసుకున్న రాజు స్నేహితుడి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రాజు ఎక్కడికి వెళ్లాడు? అని ప్రశ్నిస్తున్నారు. రాజును ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో తమదైన శైలిలో విచారణ చేపట్టి స్నేహితుడి నుంచి రాజు ఆచూకీ తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుడు చిక్కడంతో రాజు కూడా ఇక చిక్కుతాడని పోలీసులు భావిస్తున్నారు.
చదవండి: కులాలు వేరు.. అయినా ఘనంగా పెళ్లి చేస్తారని నమ్మివెళ్తే..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top