పదో తరగతి విద్యార్థినిని పెళ్లి పేరుతో లోబరుచుకుని..

Chennai: Teenager Marries Class 10 Student Illegally Molested Her - Sakshi

చెన్నై: ప్రేమ పేరుతో మాయ‌మాట‌లు చెప్పి పదో తరగతి విద్యార్థిని పెళ్లి చేసుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన మధురైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు, నిందితుడు గత సంవత్సరం కాలంగా ప్రేమించుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం​ వార్దిదరు తమ ఇంట్లో నుంచి పారిపోయి మనప్పరైలోని ఓ దేవాలయంలో ఆగస్టు 15న వివాహం చేసుకున్నారు.

అనంతరం వాళ్లు మధురైలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల అదే పాఠశాలలో మరో 16 ఏళ్ల బాలిక అదృశ్యమైన ఫిర్యాదు రావడంతో పోలీసులు విచారణ చేపట్టగా ఈ ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక‌ మైనర్‌ కావడంతో ఆమెకు మాయమాట‌లు చెప్పి లోబ‌రుచుకుని పెళ్లి చేసుకుని లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి అత‌డిపై పోక్సో స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు.

చదవండి: ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన బిస్కెట్లు, చిప్స్‌..?

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top