విజయసాయిరెడ్డిపై దాడి కేసులో ఏ–1గా చంద్రబాబు | Chandrababu As A1 On Vijayasaireddy Attack Case | Sakshi
Sakshi News home page

విజయసాయిరెడ్డిపై దాడి కేసులో ఏ–1గా చంద్రబాబు

Jan 23 2021 4:28 AM | Updated on Jan 23 2021 9:35 AM

Chandrababu As A1 On Vijayasaireddy Attack Case - Sakshi

సాక్షి, నెల్లిమర్ల రూరల్‌: ఎంపీ విజయసాయిరెడ్డిపై దాడి కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏ–1 నిందితుడిగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ నెల రెండో తేదీన విజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వచ్చిన విజయసాయిరెడ్డి.. జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలపై టీడీపీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అదే రోజు విజయసాయిరెడ్డి నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడికి బాధ్యులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావును పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు ఈ ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement