గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగుల మధ్య ఘర్షణ

Case Filed On Gandhi Hospital Regular Employee Hyderabad - Sakshi

గాంధీఆస్పత్రి: గాంధీ ఆస్పత్రిలో రెగ్యులర్‌ ఉద్యోగి, కాంట్రాక్టు కార్మికుడి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాంట్రాక్టు కార్మికుడు  శంకరయ్య గాంధీ క్యాజువాలిటీ ఆపరేషన్‌ థియేటర్‌ (సీఓటీ) వద్ద విధులు నిర్వహిస్తుండగా, రెగ్యులర్‌ ఉద్యోగి లక్ష్మీపతి మేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ (ఎంఎన్‌ఓ)గా పనిచేస్తున్నాడు.

ఈనెల 10న  హెల్త్‌ సూపర్‌వైజర్‌ రవికుమార్‌ కార్యాలయం వద్ద వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో హెల్త్‌ సూపర్‌వైజర్‌ సమక్షంలోనే లక్ష్మీపతి, శంకరయ్యపై దాడికి పాల్పడ్డాడు. ఈ విషయమై శంకరయ్య పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు లక్ష్మీపతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ నరేష్‌ తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగిపై దాడి విషయం తన దృష్టికి వచ్చిందని ఆస్పత్రి నోడల్‌ అధికారి, కాంట్రాక్టు కార్మికుల ఆర్‌ఎంఓ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధ్యుడిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దాడికి పాల్పడిన లక్ష్మీపతిని తక్షణమే సస్పెండ్‌ చేయాలని కాంట్రాక్టు కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. శంకరయ్యకు మద్దతుగా సోమవారం  ధర్నా, నిరసన చేప్టటనున్నారు.

( చదవండి: ప్రభుత్వ ధరలకే కోవిడ్‌ చికిత్స

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top