Thieves Stole A Car Along With A Woman In Punjab | భార్యతో సహా కారు దొంగతనం - Sakshi
Sakshi News home page

భర్తకు షాక్‌! భార్యతో సహా కారు దొంగతనం

Jan 8 2021 1:26 PM | Updated on Jan 8 2021 9:04 PM

Carjackers Stolen The Car With Woman Inside In Punjab - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఛండీగఢ్‌ : భార్యను కారులో వదిలి వెళ్లిన ఓ భర్తకు షాక్‌ ఇచ్చారు దొంగలు. భర్యతో సహా వాహనాన్ని తీసుకెళ్లిపోయారు. ఈ సంఘటన పంజాబ్‌లోని డేరా బస్సిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం మధ్యాహ్నం డేరా బస్సికి చెందిన రాజీవ్‌ చంద్‌, రీతు దంపతులు తమ పిల్లల స్కూలు ఫీజు చెల్లించడానికి స్కూలు దగ్గరకు వచ్చారు. కారు తాళం చెవి అలాగే ఉంచి, రాజీవ్‌ స్కూల్లోకి వెళ్లాడు. రీతు కారు లోపలే ఉండి అతడి కోసం ఎదురుచూస్తోంది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు వ్యక్తులు కారులోకి చొరబడ్డారు. ( రన్నింగ్‌ బస్సులోనుంచి దూకిన యువతులు )

ఒకరు డ్రైవింగ్‌ సీటులో కూర్చోగా.. మరొకరు రీతు నోరును గుడ్డ ముక్కతో మూసి, కారును తీసుకెళ్లిపోయారు. దాదాపు ఐదు కిలోమీటర్లు వెళ్లిన అనంతరం రీతును ఓ చోట కిందకు తోసి కారును తీసుకెళ్లిపోయారు.  స్కూల్లో పని ముగించుకుని బయటకు వచ్చిన రాజీవ్‌ అక్కడ కారు కనిపించకపోయే సరికి కంగారుపడ్డాడు. భార్యకు ఫోన్‌ చేసినా స్పందించకపోయే సరికి పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టారు. కాగా, కొన్ని గంటల తర్వాత రీతు ఇంటికి చేరుకోవటంతో రాజీవ్‌ ఊపిరి పీల్చుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement