ఎన్టీపీసీలో ఘోర ‍ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీలో ఘోర ‍ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి

Published Thu, Aug 10 2023 4:35 PM

Cable Track Accident In NTPC At Anakapalli - Sakshi

సాక్షి, అనకాపల్లి/ విశాఖపట్నం: అనకాపల్లిలోని పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎన్టీపీసీలో కేబుల్‌ ట్రాక్‌ విరిగిపడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాంలో మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. 

వివరాల ప్రకారం.. పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో 50 అడుగుల ఎత్తులో కేబుల్‌ ట్రాక్‌ నిర్మిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కేబుల్‌ ట్రాక్‌ విరిగిపడటంతో ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: కొత్తగూడెంలో సినీ ఫక్కీలో వివాహిత కిడ్నాప్‌

Advertisement
 
Advertisement